Amaravati: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులై 15, 16 తేదీల్లో ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో కేంద్ర సహకారంతో రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు మద్దతు కోరనున్నారు.
పర్యటన వివరాలు:
జులై 15 (సోమవారం):
ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి, ఉదయం 11:45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.
మధ్యాహ్నం 1:00 గంటకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం.
మధ్యాహ్నం 2:30 గంటలకు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్‌తో 1-జన్‌పథ్‌లో భేటీ.
మధ్యాహ్నం 3:00 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీతో సమావేశం – రాష్ట్ర మెట్రో ప్రాజెక్టులపై చర్చ.
మధ్యాహ్నం 3:30 గంటలకు మూర్తి మార్గ్-3లో పీవీ నర్సింహారావు జ్ఞాపకార్థంగా నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
రాత్రి 7:00 గంటలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో భేటీ.
జులై 16 (మంగళవారం):
ఉదయం 10:00 గంటలకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్. మాండవీయతో సమావేశం.
మధ్యాహ్నం 2:30 గంటలకు జలశక్తి భవన్‌లో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీ.ఆర్. పాటిల్తో సమావేశం.
సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ.
రాత్రికి ఢిల్లీలో బస చేస్తారు.
జులై 17 (బుధవారం):
ఉదయం 9:30 గంటలకు ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం.
ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వివిధ కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్ర ప్రాధాన్యతలపై చర్చించనున్నారు. మౌలిక సదుపాయాలు, మెట్రో రైలు, నీటి ప్రాజెక్టులు, ఉద్యోగావకాశాలు వంటి అంశాల్లో కేంద్రం సహకారం కోరే అవకాశం ఉంది.