Air Pollution: రాజధాని ఢిల్లీ గాలి మరోసారి విషమంగా మారింది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నవంబర్ 1 అర్థరాత్రి 400 దాటింది. నవంబర్ 1 ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీ AQI 391 వద్ద నమోదైంది. దేశంలోని 10 అత్యంత కాలుష్య నగరాల గురించి చెప్పుకుంటే వాటిలో 9 ఉత్తరప్రదేశ్‌కు చెందినవి ఉన్నాయి. UPలోని సంభాల్‌లో అత్యధిక AQI 388గా నమోదైంది. ఢిల్లీలో దీపావళి రోజు (అక్టోబర్ 31) సాయంత్రం 5 గంటలకు రియల్ టైమ్ AQI 186 రికార్డ్ అయింది. అంటే, 10-12 గంటల్లో గాలి సాధారణం నుండి చాలా చెడుగా మారిపోయింది.
ఇది కూడా చదవండి: Congress: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ విమర్శలు
Air Pollution: ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ జనవరి 1, 2025 వరకు బాణసంచా నిషేధించింది. పటాకుల తయారీ, నిల్వ, అమ్మకం, వాడటంపై నిషేధం ఉంది. పటాకులు ఆన్‌లైన్ డెలివరీ కూడా నిషేధించారు. అయినా కూడా బాణసంచా కాల్చడం జరిగింది. దీంతో కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది.


