Parliament Sessions:పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఇదే నెలలో నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. నెల రోజులపాటు రెండు రోజులు మినహా ఈ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
Parliament Sessions:పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు నెలలో స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఆ నెలల 13, 14 తేదీల్లో పార్లమెంట్ సమావేశాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మిగతా రోజుల్లో కచ్చితంగా సమావేశాలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నది.
Parliament Sessions:ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. ఉగ్రదాడి, అనంతరం ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ అమెరికా వైఖరి, అమెరికా వ్యాఖ్యలపై భారత్ వైఖరి, తదితర అంశాలపై ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అదేవిధంగా ఆపరేషన్ కగార్‌పై కూడా ప్రతిపక్ష పార్టీలు చర్చకు పట్టుబట్టే అవకాశం ఉన్నది.