Sirish: గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో హీరో రామ్‌చరణ్ తనకిచ్చిన సహకారం గురించి నిర్మాత శిరీష్ స్పష్టతనిచ్చారు. “గేమ్ ఛేంజర్ చిత్రానికి రామ్‌చరణ్ పూర్తిగా సహకరించారు. సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని చెబుతూ పూర్తి మద్దతు తెలిపారు,” అని శిరీష్ పేర్కొన్నారు.
తన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన నేపథ్యంలో శిరీష్ స్పందిస్తూ, “అలాంటి వ్యక్తిని నేను కావాలని ఎందుకు అంటాను? మెగా ఫ్యామిలీతో మాకు చాలా కాలంగా సాన్నిహిత్యం ఉంది. నా మాటలు ఎవరినైనా బాధించితే, క్షమించండి,” అని అన్నారు.
ఇక త్వరలోనే రామ్‌చరణ్‌తో మరో సినిమాకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.