Pakistan

Pakistan: బాంబు దాడి.. 13 మంది సైనికులు మృతి.. చేసింది భరత్ అంటున్న పాకిస్తాన్.. ఖండించిన భారత్!

Pakistan: పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాద దాడి చోటు చేసుకుంది. శనివారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యంపై ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిండిన కారు, సైనిక కాన్వాయ్‌ను ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది.

ఈ దాడిలో 13 మంది పాక్ సైనికులు మరణించారు. మరో 10 మంది సైనికులు, 19 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి ‘ఫిత్నా-అల్-ఖ్వారిజ్’ అనే ఉగ్ర సంస్థ బాధ్యత తీసుకున్నట్లు పాకిస్థాన్‌ ఆర్మీ మీడియా విభాగం తెలిపింది.

అయితే, కొద్దిసేపటికే పాక్ సైన్యం మరో ప్రకటన విడుదల చేసి, ఈ దాడి వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించటం గమనార్హం. భారత్ పై చేసిన ఈ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.

భారత ప్రతిస్పందన:

ఈ ఆరోపణలపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్..

పాకిస్థాన్ సైన్యం చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. వాటిని మేము ఖండిస్తున్నాం. భారత్ శాంతియుత విధానానికి కట్టుబడి ఉంటుంది” అని ‘ఎక్స్’ (పూర్వపు ట్విట్టర్) వేదికగా చెప్పారు.

గతం నుండి వస్తున్న ఉగ్ర ముప్పు:

2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రదాడులు భారీగా పెరిగాయి.

ఇది కూడా చదవండి: Robbery Attempt: విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో చోరీకి దుండ‌గుల య‌త్నం.. పోలీసుల కాల్పుల‌తో పరారీ

ప్రస్తుత ఏడాది ప్రారంభం నుంచే ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో దాదాపు 290 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందే.

తేల్చిచెప్పిన భారత ప్రభుత్వం:

పాకిస్థాన్‌ ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే జరుగుతున్నాయంటూ, భారత్ అభిప్రాయపడింది. తమ భద్రతా సమస్యలకి బయట దేశాల్ని నిందించడం ఓ అలవాటుగా మారిందని విమర్శించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *