Medak District

Medak District: మెదక్ జిల్లాలో దారుణం: రైతు భరోసా డబ్బుల కోసం తండ్రి నాలుక కోసేశాడు

Medak District: మెదక్ జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకం డబ్బుల విషయంలో తండ్రి, కొడుకుల మధ్య జరిగిన గొడవ తీవ్ర పరిణామాలకు దారితీసింది. హావేలి ఘనపూర్ మండలం, ఔరంగబాద్ తండాలో నివసించే కీర్యా అనే వృద్ధుడిపై అతని కొడుకు సురేష్ దారుణంగా దాడి చేసి కొడవలితో నాలుక కోసేశాడు.

వివరాల్లోకి వెళ్తే, కీర్యాకు ఒక ఎకరం భూమి ఉండటంతో, ఆయన బ్యాంకు ఖాతాలోకి రూ. 6,000 రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో, ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం అందులోంచి రూ. 2,000 ఖర్చు చేశారు. మిగిలిన రూ. 4,000 తన కొడుకు సంతోష్‌కు ఇచ్చారు.

అయితే, సంతోష్‌తో పాటు మరో కొడుకు సురేష్‌కి కూడా ఆ డబ్బుపై ఆశ ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన రూ. 2,000 కూడా తనకే కావాలంటూ సురేష్ తన తండ్రి కీర్యాతో గొడవపడ్డాడు. ఈ గొడవ తీవ్రం కావడంతో, సురేష్ కోపంతో ఊగిపోయి తన తండ్రిని కొట్టడమే కాకుండా, పక్కనే ఉన్న కొడవలి తీసుకుని ఆయన నాలుక కోసేశాడు.

Also Read: High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన ఆదేశాలు..

Medak District: ఈ దారుణ ఘటనతో కీర్యా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుల కోసం కన్న తండ్రినే ఇంత దారుణంగా హింసించిన కొడుకు తీరుపై గ్రామస్థులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *