Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై మరోసారి నోరు పారేసుకున్నారు. గతంలో కొన్నిసార్లు ఇండియాపై చులకనగా మాట్లాడిన ఆయన.. తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో రేప్‌లు, హింసాత్మక ఘటనలు జరుగుతాయంటూ, రక్షణ కొరవడిందని చులకనగా మాట్లాడారు. ఆ దేశ పౌరులైన మహిళలు ఇండియాకు ఒంటరిగా వెళ్లకూడదంటూ సూచనలు చేశారు.
Donald Trump: మహిళలు ఇండియాకు ఒంటరిగా వెళ్లొద్దంటూ అవమానకర రీతిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇండియాలో రేప్‌లు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని మహిళలకు హెచ్చరించారు. ముఖ్యంగా అక్కడి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లొద్దని ఆ దేశ ఉద్యోగులకు సూచించారు. ఈ మేరకు భారత్ వెళ్లే అమెరికా పర్యాటకులు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Donald Trump: లెవల్-2 ట్రావెల్ వార్నింగ్ పేరుతో జూన్ నెల 16న ఈ ఆకస్మిక ప్రకటన విడుదల కావడం గమనార్హం. నేరాలు, ఉగ్రవాదం పెరిగినందున కొన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. భారతదేశంలో మానభంగాలు చాలా వేగంగా పెరుగుతున్న నేరంగా మారిందని, కొన్ని పర్యాటక కేంద్రాల్లో హింసాత్మక నేరాలు, లైంగిక దాడులు జరుగుతన్నాయని పేర్కొన్నది.
Donald Trump: అమెరికా పర్యాటకలు ఒంటరిగా ప్రయాణించవద్దని, మహిళలైతే అసలు ఒక్కరే వెళ్లకూడదని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశ పౌరులను హెచ్చరించింది. భారత్‌లో పనిచేసే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పలు సూచనలు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏవైనా సంఘటనలు జరిగితే అత్యవసర సేవలు అందించే వెసులుబాటు అమెరికా ప్రభుత్వానికి లేనందున, అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. ఒకవేళ వెళ్లాలనుకుంటే ముందుగా అనుమతి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నది.
Donald Trump: భారతదేశంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాల జాబితాను కూడా అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసింది. ఆ జాబితాలో తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ప్రాంతాలను చేర్చింది. జమ్ముకశ్మీర్, పాక్ సరిహద్దు, మధ్యభారత్‌లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అదే విధంగా బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, మేఘాలయ, ఒడిశా రాజధానులకు వెళ్తే పర్వాలేదని, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లొద్దని అమెరికా తన దేశ పౌరులకు సూచించింది.