Upasana: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల కూతురు క్లీంకార పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. క్లీంకార పుట్టిన నాటి నుంచి ఓ సంచలనంగా నిలుస్తూ వస్తున్నది. తాజాగా హైదరాబాద్ నెహ్రూ జూపార్కులోని ఓ ఆడపులికి క్లీంకార పేరు పెట్టారు. ఈ విషయాన్ని జూపార్క్ బృందం రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు తెలిపింది. దీంతో వారు జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
Upasana: హైదరాబాద్ నెహ్రూ జూపార్కును రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులోని ఓ ఆడపులి పిల్లను దత్తత తీసుకున్నారు. దాని పోషణ ఖర్చుల కోసం నగదు చెక్కును జూపార్కు డైరెక్టర్ డాక్టర్ ఎస్ హిరేమత్, ఇతర అధికారులకు అందజేశారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న క్లీంకార పుట్టిన రోజైన జూన్ 20న జూపార్క్ సిబ్బంది కానుకగా శుభవార్తను అందజేశారు. ఆ పులిపిల్లకు క్లీంకార పేరు పెడుతూ నిర్ణయించారు.