SSMB29: రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జోరుగా సాగుతోంది. 50 కోట్లతో నిర్మించిన అద్భుత వారణాసి సెట్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ట్రెజర్ హంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్‌లో మహేష్ వేటగాడి పాత్రలో థ్రిల్ చేయనున్నాడు. వారణాసిలో రహస్య ట్విస్ట్‌లతో కూడిన ఉత్కంఠ సీన్స్ షూట్ చేస్తున్నారని సమాచారం. ఒరిజినల్ వారణాసిలో చిత్రీకరణ ప్లాన్ చేసినా, రద్దీ, షెడ్యూల్ సమస్యలతో రాజమౌళి సెట్ నిర్మాణం దిశగా అడుగులు వేశారు. ఈ సెట్ ఖర్చు బాలీవుడ్ చిత్రాలైన బాజీరావ్ మస్తానీ, దేవదాస్‌లను మించిపోయిందని టాక్. సెట్‌ను సందర్శించినవారు దాని గ్రాండియర్ చూసి ఆశ్చర్యపోతున్నారు. బాహుబలి సెట్‌లా ఇదీ ఫిల్మ్‌సిటీలో ల్యాండ్‌మార్క్‌గా మిగిలిపోనుంది. త్వరలో ఆఫ్రికాలో సుదీర్ఘ షెడ్యూల్ ప్లాన్ చేశారు, కానీ వీసా ఆలస్యంతో కొంత జాప్యం జరుగుతోంది. 2027లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

