Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: శ్రీలీల కి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ టీం.. పోస్టర్ మామూలుగా లేదుగా

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన గ్లామర్ డాల్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే, నేడు (జూన్ 14) శ్రీలీల పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక పోస్టర్ విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా విడుదలైన ఈ పోస్టర్‌లో శ్రీలీల మేకప్ లేకుండా కూడా చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. చేతిలో కాఫీ కప్ పట్టుకుని కాసేపు ఆగి చూసినట్లుగా ఉన్న ఆమె లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఎదుగుతున్న శ్రీలీలకు అభిమానుల నుండి, సినీ ప్రముఖుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా ద్వారా ఆమె కెరీర్‌లో మరో మైలురాయి చేరుతుందా? అనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *