కోలీవుడ్ నటుడు సూర్య, జ్యోతిక దంపతుల గురించి అందరికీ తెలిసిందే. సినీరంగంలో రాణిస్తూ చక్కని జంటగా విలసిల్లు తున్నారు. అయితే ఈ ఫ్యామిలీ చెన్నయ్ నుంచి ముంబైకి షిఫ్టయింది. ఎందుకు షిఫ్టయ్యామనే విషయాలను సూర్య ఇటీవలే కంగువ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జ్యోతిక కోసమే తాము ముంబై వచ్చేశామని అంటున్నా 18 ఏండ్ల వయస్సున్నప్పుడు తన కోసం చెన్నయ్ వచ్చిన జ్యోతిక, తన ఫ్యామిలీ కోసం ఎన్నో వదులు కుందంటున్నారు. ఎన్నో త్యాగాలు చేసిందని చెబుతున్నారు. తన స్నేహితులను కెరీర్ ను వదులు కుందని చెబుతున్నారు. తన లైఫ్ స్టైల్ మార్చుకుం దని సూర్య చెప్పారు. కొవిడ్ తర్వాత ఆ మార్పు అవసరం అనిపించిందని, అందుకే తామంతా ముంబయి షిఫ్ట్ అయ్యామని అంటున్నారు. ఇప్పుడు ఆమెకు ఎన్నో కొత్త అవకాశాలు వస్తున్నాయన్నా రు.
డిఫరెంట్ ప్రాజెక్ట్ ల్లోనూ పనిచేస్తోందని తెలిపారు. వైవి ధ్యమైన సినిమాల్లో నటిస్తూ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని వివరించారు. తాను గొప్ప డైరెక్టర్ల తో పనిచేయాలని అనుకుంటాననని, జ్యోతిక మాత్రం ఎప్పుడూ కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి వర్క్ చేయాలని అను కుంటుందని తెలిపారు. మహిళలకు కూడా పని విషయంలో స్వాతంత్య్రం ఉం డాలనేది తన అభిప్రాయమని చెప్పారు. సూర్య, జ్యోతిక మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ముంబైకు మారారనే రూమర్లు వచ్చాయి. వారిద్దరూ విడాకులు తీసుకోనున్నారని, అందుకే పుట్టింటికి జ్యోతిక వెళ్లారంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఇప్పుడు ఈ మాటలతో ఈ రూమర్లకు పూర్తిగా చెక్ పెట్టేశారు సూర్య. జ్యోతికతో తన అనుబంధం ఎంత గొప్పదో, ఆమె గురించి తాను ఎంత బాగా ఆలోచిస్తానో వివరించారు. సూర్య మాటలకు సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి.

