Bandi sanjay: పోలవరానికి జాతీయ హోదా కల్పించింది ప్రధాని మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరినాలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ రోజ్ గార్ మేళాను ప్రారంభించినట్లు వెల్లడించారు. రోజ్ గార్ మేళాను ప్రధాని నరేంద్రమోదీ రెండేళ్ల క్రితం ప్రారంభించారని తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు.
పోలవరంకు జాతీయ హోదా కల్పించింది మోదీ ప్రభుత్వమే అన్న ఆయన.. విశాఖపట్నం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రెండేళ్లలో 8 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారని మంత్రి బండిసంజయ్ చెప్పారు.ఇక తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.
రాజకీయ పార్టీలు తమ పగలు, శతృత్వాలను పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని.. అభివృద్ధిలో అందరూ కలిసి పనిచేయాలన్నారు.

