Mahaa Breaking: తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కీలక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టంగా నివేదికలో పేర్కొంది.
విజిలెన్స్ వివరాల ప్రకారం, మేడిగడ్డ నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగిందని స్పష్టం చేసింది. 17 మంది ఇరిగేషన్ శాఖ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే ప్రాజెక్టు పనుల్లో భాగమైన ఎల్ అండ్ డి సంస్థపై కూడా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.
నివేదికలో 33 మంది ఇంజనీర్లపై శిక్షాన్షాలు (పెనాల్టీలు) విధించాలని సూచించింది. వీరిలో పలువురు మాజీ ఈఎన్సీలు (ఎన్జినీరింగ్ చీఫ్లు), ప్రస్తుత సీఎీలు (చీఫ్ ఇంజనీర్లు), ఎస్ఈలు (సూపరింటెండింగ్ ఇంజనీర్లు) ఉన్నారు. అంతేగాక, 7 మంది రిటైర్డ్ ఇంజనీర్లపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. క్షేత్ర స్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదిక లో పేర్కొన్న విజిలెన్స్.
Also Read: Etala rajendar: తెలంగాణకు బీజేపీనే దిక్సూచి
Mahaa Breaking: విజిలెన్స్ నివేదికలో చెబిన ప్రకారం, క్షేత్ర స్థాయిలో (ఫీల్డ్ లెవెల్) ఉన్న అధికారుల నిర్లక్ష్యం కారణంగా మేడిగడ్డ బ్యారేజ్ కు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంది. నిర్మాణ సమయంలో ప్రామాణికాలు పాటించకపోవడం, పరీక్షలు సరిగా జరపకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్పష్టం చేసింది.

