Minister Narayana: రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని తీసుకువచ్చారని…ప్రజలందరూ ఇసుకని ఉచితంగా తీసుకెళ్లవచ్చని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ..బోడి గాడి తోట ..గాంధీ గిరిజన కాలనీ.. పొర్లుకట్ట …పలు ప్రాంతాల ఇసుక రీచులను ఆయన అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక రీచ్‌ల పరిస్థితిని అధికారుల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఇసుకను అందించాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు.
Minister Narayana: ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే…ఫస్ట్ రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రషన్స్ డెవలప్ కావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమన్నారు. అందుకనే ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చారన్నారు. ట్రాక్స్ లు తీసేసి…ఎవరైనా ఎడ్ల బండ్లపై ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. నెల్లూరు సిటీ పరిధిలో మైన్స్, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు సుమారు నాలుగు ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారని తెలిపారు. దీనివల్ల ట్రాక్టర్ ఇసుక రూ. 4వేల నుంచి 5వేలు ఉంటే…ఒక్క సారిగా రూ. 2వేల నుంచి 1500లోపే పడిపోయిందన్నారు. దగ్గరగా ఉంటే రూ. 1500లు, దూరంగా ఉంటే రూ. 2వేల లోపు ఖర్చవుతుందన్నారు. దీంతో ప్రజలు ఇసుకని ఎంతో ఫ్రీగా, స్వేచ్ఛగా తీసుకెళుతున్నారన్నారు.
Minister Narayana: మరో 4 రీచ్‌లను ఓపెన్ చేయాలని ఇప్పటికే కలెక్టర్, కమిషనర్‌లకు తెలియజేయడం జరిగిందన్నారు. మొత్తం మీద ఇసుక రేటు రూ. 1200లకు రావాలన్న ఆలోచనతోనే ప్రజలకి దగ్గర ఏరియాలో రీచ్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నెల్లూరు సిటీలో ఎక్కువ రీచ్‌ల ఓపెన్ చేయడం వల్ల…రద్దీ తగ్గుతుందన్నారు. ముఖ్యంగా రీచ్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి మానటరింగ్ కలెక్టర్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాలకు ఇవ్వాలని ఇప్పటికే అధికారుల్ని ఆదేశించడం జరిగిందన్నారు. రీచ్‌లలో మిషన్లు పెట్ట కూడదని….పొరపాటున పెడితే వాటిని పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు.