SouthWest Mansoon:నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి. ఏటా జూన్ 1వ తేదీన వచ్చే ఈ రుతుపవనాలు ఈ సారి 8 రోజులకు ముందుగానే దేశంలోకి ప్రవేశించడం విశేషం. ఇంత ముందుగా రావడం 16 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. గతంలో 2009లో మే నెలలోనే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. అంతకు ముందు 2001లో వచ్చాయి.
SouthWest Mansoon:1918వ సంవత్సరంలో మే 11వ తేదీనే రుతుపవనాలు వచ్చాయి. మరోవైపు అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18వ తేదీన వచ్చాయి. మరో మూడు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఏపీలోకి విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వీటి ప్రభావంతో తొలిరోజైన నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించగానే అన్నిచోట్ల విస్తరించి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
SouthWest Mansoon:ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతోనే దేశవ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో కొద్దిరోజుల్లోనే దేశమంతా విస్తరించే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. వాస్తవంగా మే నెల 27న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ ప్రకటించింది. అయితే ఐఎండీ అంచనాకు భిన్నంగా మూడు రోజుల ముందే కేరళను తాకడం గమనార్హం.
SouthWest Mansoon:ఇప్పటికే కేరళను పూర్తిగా, తమిళనాడులో 90శాతం, కర్ణాటక, ఈశాన్యంలో మిజోరంలో వివిధ ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలకు, మాల్దీవులు, కొమరిన్ మిగిలిన భాగాలకు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలకు తాకాయి.

