Bandi Sanjay: రేవ్ పార్టీపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటని అన్నారు.రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా, రేవ్ పార్టీపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనే విషయాన్ని ప్రభుత్వం నిరూపించాలని అన్నారు.
కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీలా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విషయంలో సుద్దపూసను కావాలనే తప్పించారనే వార్తలు మీడియాలో వార్తలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా.. అడ్డంగా తాము డ్రగ్స్ తీసుకోలేదంటూ బుకాయిస్తారేమోనని కామెంట్ చేశారు. జన్వాడ రేవ్ పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ చుట్టూ సీసీ ఫుటేజీతో సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడలన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని బండి సంజయ్ అన్నారు. యువతను భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై రాజీ ధోరణి ఎందుకని ప్రశ్నించారు.