Pavitra Lokesh: ప్రస్తుతం పవిత్రా లోకేష్ తన సినిమాల కంటే వ్యక్తిగత కారణాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆమె వివాహం అనే అంశం కొన్ని రోజులు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి, వైరల్ అయింది.
ముఖ్యంగా దివంగత నిర్మాత, దర్శకురాలు విజయ నిర్మల కుమారుడు నరేష్ తో తన వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో ఆమె తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. కానీ నరేష్ నటించే ప్రతి సినిమాలోనూ పవిత్రకు అవకాశాలు వస్తూనే ఉండటం గమనార్హం.
ఇటీవలి ఇంటర్వ్యూలో, పవిత్రా లోకేష్ తన మొదటి క్రష్ ఎవరి గురించి మాట్లాడింది. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు, నాగార్జున అంటే నాకు చాలా ఇష్టం. తన జీవితంలో అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని తాను భావించానని వెల్లడించారు.
Also Read: War-2 Teaser: హృతిక్ రోషన్ కి డామినెటే చేసిన ఎన్టీఆర్.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..
Pavitra Lokesh: తన మొదటి క్రష్ నరేష్ కాదని, నాగార్జున అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాగార్జున తర్వాత ప్రకాష్ రాజ్ ని చూసినప్పుడు తనకు కూడా అలాగే అనిపించిందని పవిత్ర అన్నారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

