Vishal: తమిళ నటుడు విశాల్ కృష్ణ త్వరలో వివాహ జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. నటి సాయి ధన్సికతో ఆయన పెళ్లి త్వరలో జరగనుంది. ఈ విషయాన్ని విశాల్ స్వయంగా ప్రెస్ మీట్ లో వెల్లడించారు. దీనితో పాటు తన వివాహ తేదీని కూడా ప్రకటించారు. ఈ వివాహం ఆగస్టు 29 2025 లో జరగనుంది. 47 ఏళ్ల నటుడు విశాల్ తనకంటే 12 సంవత్సరాలు చిన్నదైన నటి సాయి ధన్సికను వివాహం చేసుకోవడం విశేషం. నటులు విశాల్, సాయి సాయి ధన్సిక చాలా నెలలుగా డేటింగ్ చేస్తున్నారు. తమిళ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత తాను పెళ్లి చేసుకుంటానని నటుడు విశాల్ చెప్పేవారు. తమిళ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నందున, విశాల్ తన పుట్టినరోజు అయిన ఆగస్టు 29న వివాహం చేసుకోబోతున్నట్లుగా వెల్లడించారు.
మొదట్లో, నడిగర్ సంగమ భవనం కేవలం 3 సంవత్సరాలలో పూర్తవుతుందని నేను అనుకున్నాను. అయితే, 9 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆగస్టు 15న మేము నడిగర్ సంగమ భవనాన్ని ప్రారంభించబోతున్నాము. నా వివాహం రాబోయే 4 నెలల్లో జరగవచ్చని ఆయన అన్నారు.
Also Read: Khaleja: మహేష్ మేనియా.. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అనేలా ఖలేజా రీరిలీజ్?
సాయి ధన్షిక తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఒక ప్రముఖ నటి. రజనీకాంత్ నటించిన కబాలి చిత్రంలో ధన్సిక నటించింది. గతంలో పేరణ్మై (2009), మాంజ వేలు (2010) నిల్ గవాని సెల్లతే (2010) చిత్రాలలో నటించింది. అరవాన్, పరదేశి చిత్రాలలో నటనకు గానూ విమర్శకుల ప్రశంసలు పొందింది. కబాలి చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె పాత్ర పోషించడం ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళంతో పాటు, ధన్సిక అనేక తెలుగు చిత్రాలలో కూడా నటించింది.

