Bollywood: ఒకప్పుడు బాలీవుడ్‌లో ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్‌లతో పోటీపడిన అందాల హీరోయిన్ బర్ఖా మదన్ ఇప్పుడు సన్యాస జీవితంలో మునిగిపోయింది. 1996లో ‘ఖిలాడియోన్ కా ఖిలాడీ’తో అక్షయ్ కుమార్, రవీనా టాండన్‌లతో కలిసి బర్ఖా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సూపర్‌హిట్ చిత్రంలో ఆమె నటన అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత 2003లో రామ్ గోపాల్ వర్మ ‘భూత్’లో భయానక పాత్రతో మళ్లీ ఆకట్టుకుంది. అజయ్ దేవగన్, ఊర్మిళ వంటి స్టార్లతో నటించిన బర్ఖా, ఆ పాత్రతో మంచి గుర్తింపు పొందింది. 2005-09 మధ్య ‘సాత్ ఫేరే’ సీరియల్‌తో టీవీలో సత్తా చాటింది. 2010లో నిర్మాతగా మారి ‘సోచ్’, ‘సుర్ఖాబ్’ చిత్రాలను నిర్మించింది.
Also Read: Dadasaheb Phalke Biopic: రాజమౌళి కాదు.. ఆమిర్ టీమ్ సంప్రదించింది.. బయోపిక్‌పై స్పష్టత
Bollywood: కానీ, 2012లో బౌద్ధమతంలోకి మారి సినీ రంగానికి దూరమైంది. గత 13 ఏళ్లుగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ పర్వతాల్లో సన్యాస జీవితం గడుపుతున్న బర్ఖా, గ్లామర్ ప్రపంచాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. ఆమె ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది!