Nara Lokesh:

Nara Lokesh: ఏపీలో మంత్రి నారా లోకేష్ రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో కీల‌క వ్యాఖ్య‌లు

Nara Lokesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అనంత‌పురం జిల్లాలో రెండోరోజైన‌ శుక్ర‌వారం (మే 17) కూడా ప‌ర్య‌టించారు. జిల్లాలోని గుత్తి మండ‌లం బేత‌పల్లిలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా 2,300 ఎక‌రాల్లో 22 వేల కోట్ల‌తో చేపట్టిన పున‌రుత్పాద‌క విద్యుదుత్ప‌త్తి కాంప్లెక్స్ ఏర్పాటుకు మంత్రి శ్రీకారం చుట్టారు. ప‌వ‌న‌, సౌర‌, బ్యాట‌రీ ఆధారిత విద్యుత్తు ఉత్ప‌త్తి కాంప్లెక్స్ నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో మంత్రి నారా లోకేశ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Nara Lokesh: భార‌త క్లీన్ ఎన‌ర్జీ విప్ల‌వానికి శంకుస్థాప‌న చేశామ‌ని మంత్రి నారా లోకేశ్ ప్ర‌క‌టించారు. 22 కోట్ల‌తో పున‌రుత్పాద‌క విద్యుత్తు కాంప్లెక్స్ నిర్మాణం చేప‌ట్టామ‌ని తెలిపారు. భ‌విష్య‌త్తు ఆశ‌లు, ఆకాంక్ష‌ల వార‌ధిగా ఈ పున‌రుత్పాద‌క విద్యుదుత్ప‌త్తి కాంప్లెక్స్ నిలుస్తుంద‌ని చెప్పారు. ఇది ప‌రిశ్ర‌మ మాత్ర‌మే కాద‌ని, ఒక ఉద్య‌మ‌మ‌ని లోకేశ్‌ ఉద్ఘాటించారు.

Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజ‌ధాని, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ నినాదంతో ముందుకెళ్దామ‌ని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. అనంత‌పురం ప్రాంతానికి కియా మోట‌ర్ల ప‌రిశ్ర‌మ‌ను తీసుకొచ్చామ‌ని గుర్తుచేశారు. అనంత‌పురం, క‌ర్నూలు ప్రాంతాలను రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ హ‌బ్‌గా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. గడిచిన ఐదేండ్లు రాష్ట్రం గాడితప్పి యువ‌త తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని చెప్పారు.

Nara Lokesh: మ‌న వ‌ద్ద చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ వంటి బ్రాండ్ న‌గ‌రాలు లేవ‌ని, మ‌న వ‌ద్ద ఉన్న‌ది సీఎం చంద్ర‌బాబు బ్రాండ్ ఉన్న‌ద‌ని, అదే మ‌న‌ల‌ను అభివృద్ధిలో దూసుకెళ్లేలా చేస్తుంద‌ని నారా లోకేశ్ పున‌రుద్ఘాటించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *