Naga Vamsi: ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురుములో’…. బన్నీ – త్రివిక్రమ్ కలయిక లో ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాలు. హ్యాట్రిక్ హిట్స్ అందించిన ఈ కాంబో ఇప్పుడు అంతకు మంచి అనేలా ప్లాన్ చేస్తోంది. మైథలాజికల్ నేపథ్యాన్ని ఎంచుకుని ఇప్పటి వరకూ తెలుగు తెరపై రాని విధంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయినట్లు సితార ఎంటర్ టైన్ మెంట్ నాగవంశీ చెబతున్నాడు. రాజమౌళి కూడా టచ్ చేయనటువంటి జానర్ లో ఈ సినిమా ఉండనుందట.
Naga Vamsi: వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ స్నేక్ పీక్ రిలీజ్ చేస్తారట. 2025 మార్చి నుంచి షూటింగ్ మొదలు కానుందట. బన్నీ నటించిన ‘పుష్ప2’ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆ తర్వాత కొంత కాలం రెస్ట్ తీసుకుని త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడట అల్లు అర్జున్. ఈ సినిమాను హారిక-హాసిని క్రియేషన్స్ తో కలసి గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనుంది. ఇక ఈ మూవీ త్రివిక్రమ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా రూపొందనుండటం గమనార్హం. మరి ఈ సినిమాకు సంబంధించి పూర్తి డిటైల్స్ తెలియాలంటే వచ్చే ఏడాది జనవరి వరకూ ఆగాల్సిందే.

