Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో హైలైట్గా నిలుస్తోంది. తాజాగా లండన్లో తన మైనపు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా రామ్ చరణ్ ‘పెద్ది’ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని, ఇది తన ఐకానిక్ చిత్రం ‘రంగస్థలం’ కంటే మెరుగ్గా ఉంటుందని ఆయన ధీమాగా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ‘పెద్ది’ కథ, రామ్ చరణ్ పవర్ఫుల్ పాత్రతో పాటు భావోద్వేగాలు, యాక్షన్తో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది? రంగస్థలం రికార్డులను బద్దలు కొడుతుందా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. వేచి చూడాలి!

