Disha Patani: తెలుగు సినిమా ‘లోఫర్’తోనే మోడల్ దిశా పటానీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీ చిత్రాలతో బిజీ అయిపోయింది. అయితే ‘కల్కి’తో మరోసారి తెలుగులో తన అదృష్టం పరీక్షించుకోవాలని దిశా పటానీ ఆశపడింది. కానీ అది అడియాసే అయ్యింది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న ‘కల్కి’ సినిమాతో దిశా పటానీ పేరుకు హీరోయిన్ కానీ ఆమెపై చిత్రీకరించిన ఓ పాటను చివరి నిమిషంలో మేకర్స్ తొలగించారు. దాంతో దిశా పటానీ కెరీర్ కు ‘కల్కి’ ఏరకంగానూ ఉపయోగపడలేదు.
ఇక సూర్య ‘కంగువా’ మూవీలో దిశా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ భారీ యాక్షన్ మూవీలోనూ దిశా పటానీ కేవలం అరగంట మాత్రమే కనిపిస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… తాజాగా ‘కంగువా’ నుండి ఓ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఇందులోనూ దిశా పటానీ విపరీతంగా స్కిన్ షో చేయడంతో మూడు సెకన్ల నిడివిని కట్ చేశారట సెన్సార్ అధికారులు. క్లీవేజ్ షో సీన్స్ ను ఖచ్చితంగా తొలగించాల్సిందేనని ఆదేశించారట. సో… నటనతో కాకపోయినా… గ్లామర్ ట్రీట్ తో కుర్రకారుని తనవైపు తిప్పుకుందామని ఆశపడుతున్న దిశా పటానీకి సెన్సార్ నుండి బాగానే ఎదురుదెబ్బ తగిలింది.