Blue Tea

Blue Tea: బ్లూ టీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Blue Tea: ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన ఈ రోజుల్లో, ప్రకృతిదత్తమైన ఔషధ గుణాలు కలిగిన పానీయాలు మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి. అలాంటి వాటిలో “బ్లూ టీ” ఒకటి. శంఖుపుష్పం (బటర్‌ఫ్లై పీ ఫ్లవర్‌) అనే మొక్క నుండి తయారయ్యే ఈ నీలిరంగు టీ ఆరోగ్యానికి మేలు చేసే అనేక లక్షణాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది.

ఈ బ్లూ టీ రోజూ తాగితే శరీరంలో ఉన్న చెడు కొవ్వు తగ్గుతుంది, రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది సహాయపడుతుంది. అంతేకాదు, చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేసి ముడతలు తగిస్తాయి, జుట్టు రాలడం తగ్గించడంలోనూ ఇది దోహదపడుతుంది.

శంఖుపుష్పంతో తయారయ్యే ఈ టీ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎసిడిటీ, గ్యాస్‌, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఉపశమనం కలిగించగలదు. అంతేకాకుండా, శరీరంలో పేరుకుపోయే టాక్సిన్స్‌ను ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు తొలగించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఇది మనసుకు ప్రశాంతతనిచ్చే లక్షణాలనూ కలిగి ఉంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. అంతేగాక, ఇది నిద్రను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.

Also Read: Red Wine: రెడ్​ వైన్​తో మెరిసే చర్మం మీ సొంతం

శంఖుపుష్పం టీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది కొలెస్ట్రాల్‌, రక్తపోటు స్థాయులను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టకుండా చూసి గుండెపోటు అవకాశాలను తగ్గిస్తుంది. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నదానిప్రకారం, దీని వినియోగం క్యాన్సర్‌ను కూడా నివారించగలదని చెబుతున్నారు.

శంఖుపుష్పాన్ని పూజలలో పవిత్రంగా భావించినప్పటికీ, దీని ఔషధ గుణాలు ఆయుర్వేదంలో ఎంతో ప్రత్యేక స్థానాన్ని పొందాయి. ఇప్పటివరకు ఈ టీని తాగకపోతే, ఇప్పటికైనా ప్రయత్నించండి. దీన్ని ఎండిన పువ్వులతో సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. బ్లూ టీ, సహజసిద్ధమైన ఔషధ గుణాలతో ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత పానీయం.

గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *