Israil: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు దళాలు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడికి పాల్పడ్డాయి. బాలిస్టిక్ క్షిపణితో జరిగిన ఈ దాడిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా, వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఈ దాడి బెన్గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎయిరిండియా టెల్ అవీవ్‌కి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది.
ఇక ఈ ఘటనపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. హౌతీ దళాలకు ఇప్పటికే కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది. “ఇలాంటి దాడులకు ప్రతీకార చర్యలు తప్పవు” అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అధికారికంగా హెచ్చరించారు.
ఇజ్రాయెల్‌పై శత్రుదేశాల నుంచి ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో, భద్రతా పరంగా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం పెరిగినట్లు భావిస్తున్నారు. హౌతీ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ తీసుకునే తదుపరి చర్యలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.