ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సమావేశంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా సాధించిన పురోగతిపై చర్చిస్తారు. అలాగే కూటమి పార్టీల మధ్య సమన్వయం.. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్ళను పరిష్కరించుకోవడంపై చర్చించే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు పూర్తి అవుతున్నప్పటికీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. ఈరోజు జరిగే కూటమి నేతల సమావేశంలో ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాధమికంగా నామినేటెడ్ పోస్టుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారనీ.. ఈ సమావేశంలో వాటిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారనీ తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎన్డీయే కూటమి నేతల సమావేశం జరుగుతుంది.