Kamareddy: భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చాయి. చివరకి భార్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయి.. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలానికి చెందిన పసుపులేటి పూజితను అదే మండలానికి చెందిన సాయితో గతేడాది మార్చి 28న వివాహం జరిగింది.
ఇద్దరు కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.కొన్ని రోజుల నుంచి భర్త సాయి వేరే అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నాడనే విషయంపై భార్య పూజిత ప్రశ్నించగా.. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి..
అలాగే వివాహ సమయంలో ఒప్పుకున్న అర ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసే విషయంలో రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని, తనని ప్రతి విషయంలో భర్త సాయి ఇబ్బంది పెడుతున్నారని మనస్థాపం చెందిన పూజిత బిల్డింగ్ పైనుంచి దూకి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతిరాలి తండ్రి కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదుతో పూజిత భర్త సాయిపై కేసుపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

