Mohanlal: మాలీవుడ్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హవా కొనసాగుతోంది. మార్చి 27న విడుదలైన ‘ఎంపురన్’ రూ.260 కోట్లకు పైగా వసూళ్లతో మాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. నెల రోజుల వ్యవధిలోనే ఏప్రిల్ 25న రిలీజైన ‘తుడరుమ్’ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. 15 ఏళ్ల తర్వాత శోభనతో మోహన్‌లాల్ జోడీ కట్టిన ఈ చిత్రం, ‘దృశ్యం’ తరహాలో ఫ్యామిలీ-రివేంజ్ డ్రామాగా రూపొందించాడు దర్శకుడు తరుణ్ మూర్తి.
‘ఎంపురన్’, ‘తుడరుమ్’ విజయాలతో మోహన్‌లాల్ ‘మాల్కోటై వాలిబన్’, ‘బర్రోజ్’ పరాజయాలను సరిచేశారు. సింపుల్ ఫ్యామిలీ మ్యాన్ గెటప్‌లో తక్కువ బడ్జెట్ చిత్రాలతో కాసుల వర్షం కురిపిస్తున్నారు. ‘ఎంపురన్’ రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూ.260 కోట్లు రాబట్టగా, ‘తుడరుమ్’ రూ.30 కోట్లలోపు ఖర్చుతో రూ.100 కోట్ల క్లబ్‌లో నిలిచింది. లాభాల లెక్కలో ‘తుడరుమ్’ మెరుగ్గా నిలిచింది. తెలుగులోనూ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. మోహన్‌లాల్ స్టార్‌డమ్‌తో మాలీవుడ్ రికార్డులు బద్దలవుతున్నాయి.

