Sheep theft: తండ్రి గొర్రెల కాపరి.. కొడుకు పోలీస్ కానిస్టేబుల్.. తండ్రి అనారోగ్యం కారణంగా గొర్రెల మంద వద్ద కావలిగా కానిస్టేబుల్ అయిన కొడుకు వెళ్లాడు. అదే రాత్రి దుండగులు దాడి చేసి, ఆ కానిస్టేబుల్‌ను తీవ్రంగా గాయపరిచి, 70 గొర్రెలను అపహరించుకుపోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్ సమీపంలో ఉన్న కోహెడలో జరిగింది.
Sheep theft: హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో నవీన్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తండ్రి గొర్రెల పెంపకందారుడు. నిత్యం గొర్రెల మందను మేపుతూ, కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. రాత్రిపూట మందను బహిరంగ ప్రదేశంలో ఉంచి కాపలాగా ఉంటాడు.
Sheep theft: నిన్న రాత్రి ఆయనకు అనారోగ్యంతో బాధపడుతుండగా, కొడుకైన నవీన్‌ను గొర్రెల మంద వద్ద కాపలా ఉండాలని కోరాడు. దీంతో కానిస్టేబుల్ నవీన్ గొర్రెల మంద వద్ద కాపలాకు వెళ్లాడు. ఎప్పటి నుంచో కాపుకాసిన దుండగులు కత్తులతో వచ్చీ రాగానే నవీన్‌పై దాడి చేశారు. ఆ మందలోని 70 గొర్రెలను దుండగులు అపహరించుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.