వినాయక ఉత్సవాలు ముగింపు దశలోకి వచ్చేశాయి. భక్తులతో విశేష పూజలందుకున్న గణపయ్య ఇక సెలవు.. మళ్ళీ వస్తాను అంటూ వీడ్కోలు తీసుకుంటున్నాడు. వినాయకుని నిమజ్జనోత్సవం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతోంది. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో విఘ్నేశ్వరుని నిమజ్జనం కోలాహలంగా జరుగుతోంది. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్ దగ్గరకి చేరుతున్నాయి. మరోవైపు ఖైరతాబాద్ భారీ గణనాధుని నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అక్కడ నుంచి హుస్సేన్ సాగర్ వైపు ఖైరతాబాద్ గణపతి మెల్లగా కదులుతూ వస్తున్నారు. మరి కొద్దీ గంటల్లో ఈ వినాయకుని నిమజ్జనం పూర్తి అవుతుంది
