Blackberries: ప్రతిరోజూ మనం తినే ఆహారంలో కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా, ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బెర్రీ పండ్లను – స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీ, బ్లాక్ బెర్రీ – నిత్యం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వారు పేర్కొన్నారు. బ్లాక్ బెర్రీలు చూడడానికి చిన్నగా, రుచికరంగా ఉంటాయి. కానీ వాటి లోపల ఉన్న పోషకాలు చాలా శక్తివంతమైనవని.
యాంటీ ఆక్సిడెంట్లు – శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి
విటమిన్ C – రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఫైబర్ – జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
విటమిన్ K – ఎముకలకు బలం ఇస్తుంది
మధుమేహం ఉన్నవాళ్లకూ మంచిదే
బ్లాక్ బెర్రీలలో షుగర్ చాలా తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా వీటిని భయపడకుండా తినొచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నిలుపుతాయి.
గుండెకు, మెదడుకు రక్షణ
ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం తగ్గిస్తాయి. దీని వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అలాగే మెదడులో కణాలు బలంగా ఉండేలా చేస్తాయి.
Also Read: Cashews: జీడిపప్పు తినడం వల్ల బరువు పెరుగుతుందా..? తగ్గుతుందా..?
చర్మానికి చక్కటి సహాయం
విటమిన్ C చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. వయసు పెరిగినప్పటికీ చర్మం కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.
రోజుకి ఒక్క గుప్పెడు బ్లాక్ బెర్రీలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. ఇవి సహజంగా లభించే ఔషధంలా పనిచేస్తాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాల్ని ఇస్తాయి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ఇవి తినడం ఇప్పుడు నుంచే మొదలు పెట్టండి!
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.