AP news: లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు..రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ 

AP news: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుంది ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT). అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు.

సిట్ ఇప్పటికే మూడుసార్లు నోటీసులు పంపినా, విచారణకు రాజ్ కేసిరెడ్డి హాజరుకాలేదు. విచారణకు సహకరించకపోవడంతో సిట్ కఠిన చర్యలు తీసుకుంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసినా, కోర్టు నుండి అనుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది.

లిక్కర్ స్కాంలో రాజ్ కేసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన సిట్, తాజా అరెస్టుతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nabha Natesh: అవకాశాలు నిల్.. హాట్ ఫోటో షూట్ తో హీటు పుట్టిస్తున్న నభ నతేష్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *