Salt Water: వేసవి వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని నివారించడానికి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎండ కారణంగా అధిక చెమట, డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ క్షీణత వంటి సమస్యలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అలాంటి సందర్భాలలో ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు వేసి తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. కానీ ఇది నిజం. చిటికెడు ఉప్పుకు అంత శక్తి ఉంది అంటే మీరు దానిని నమ్మాల్సిందే. కాబట్టి ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనేది తెలుసుకుందాం..
ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగడం చాలా మంచి అలవాటు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కండరాల నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సాధారణంగా, శరీరం చెమటలు పట్టినప్పుడు, శరీరం నుండి ముఖ్యమైన మినరల్స్ పోతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గితే డీహైడ్రేషన్, దాహం, మలబద్ధకం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి, త్రాగే నీటిలో కొద్దిగా ఉప్పు కలపడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అదనంగా ఇది సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
ఉప్పు నీరు ఎవరికి మంచిది?
ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారు, ముఖ్యంగా అధికంగా చెమట పట్టేవారు, వ్యాయామం చేసేవారు డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు. ఇటువంటి సమయంలో ఉప్పు నీటిని తాగడం వల్ల ఉప్పులోని సోడియం కంటెంట్ శరీరం నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఇది డీహైడ్రేషన్, అలసట సమస్యలను తగ్గిస్తుంది. ఇది కండరాలకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. అందువల్ల, కండరాల నొప్పులు, నరాల ఒత్తిడి సమస్యలు ఎదురైతే ఉప్పునీరు తాగడం చాలా మంచిది. అంతేకాకుడా ఆహారం త్వరగా జీర్ణం కానప్పుడు, అది గ్యాస్, ఉబ్బసం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఉప్పునీరు తాగడం వల్ల కడుపులోని ఆమ్ల స్థాయిలు సరైన స్థాయిలో ఉండటం, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Also Read: Eye Health: కంటి రక్త నాళాల బాగుండాలంటే ఇవి తినాలి
దీన్ని ఎవరు తినకూడదు?
చిటికెడు ఉప్పు కలిపిన నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఇది అందరికీ మంచిది కాదు. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఉప్పునీరు తాగొద్దు. ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. అదనంగా, అధిక రక్తపోటు ఉన్నవారు కూడా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే ఉప్పునీరు తాగాలి. చిటికెడు ఉప్పు కలిపిన నీరు త్రాగడం సాధారణ విషయంగా అనిపించినప్పటికీ అది శరీరంలో అనేక మార్పులకు కారణమవుతుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.