Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సస్పెండ్ చేసిన 163 మంది ఏఈవోలను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించినట్టు సమాచారం. ఈ మేరకు బుధవారం సస్పెండ్ అయిన ఏఈవోలతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయని తెలిసింది. దీంతో ప్రభుత్వం కొంత మేరకు తగ్గగా, ఏఈవోలు తలొగ్గారు. డిజిటల్ క్రాప్ సర్వే చేయబోమని తేల్చి చెప్పినందుకు ప్రభుత్వం సస్పెన్షన్ చర్యలు తీసుకున్నది.
Telangana: అయితే చర్చల్లో మాత్రం సర్వేకు మొగ్గు చూపినట్టుగా తెలిసింది. డిజిటల్ క్రాప్ సర్వేకు ఉన్న అనేక సమస్యల పరిష్కారానిక మరోసారి చర్చలు జరుపుతామని డైరెక్టర్ ప్రభుత్వం తరఫున వారికి హామీ ఇచ్చారట. ముందుగా సర్వేను ప్రారంభించాలని ఏఈవోలకు సూచించారట. దీంతో వారంతా అంగీకరించినట్టు తెలిసింది.