Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ‘వార్ 2’తో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రం తర్వాత తారక్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ కొత్త ప్రాజెక్ట్, అలాగే కొరటాల శివతో ‘దేవర పార్ట్ 2’ చేయనున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ లుక్‌లో వచ్చిన మార్పు అభిమానులను ఆశ్చర్యపరిచింది.
సన్నగా, చిక్కిపోయిన తారక్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక ప్రశాంత్ నీల్ సినిమా కోసమే అని తెలుస్తోంది. అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఈ లుక్ తారక్ కొత్త పాత్ర కోసం సిద్ధం చేసినదని సమాచారం.
Also Read: Stalin: మెగాస్టార్ స్టాలిన్ రీరిలీజ్!
Jr NTR: ప్రశాంత్ నీల్ ఈ చిత్రంతో ఎలాంటి మాయ చేయనున్నాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోంబళే ఫిల్మ్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. రిలీజ్ డేట్‌ను 2026 జనవరి 9గా లాక్ చేశారు. ఎన్టీఆర్ కొత్త లుక్‌తో థియేటర్లలో ఎలాంటి సందడి చేయనున్నాడో చూడాలి.