Devara: ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘దేవర’ చిత్రం మరో రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇప్పటికే సోలో హీరోగా ఎన్టీర్ కెరీర్ లో భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచిన ‘దేవర’ ఇప్పుడు ఎపి లో ఒక్క చోటే 100 కోట్లను వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. కొరటాల శివ కు కమ్ బ్యాక్ సినిమాగా నిలిచిన ‘దేవర’ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. రిలీజ్ రోజు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 25 డేస్ రన్ తర్వాత కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్ళను సాధిస్తుండటం గమనార్హం. ఇక ఆంధ్రా ఏరియాలో జిఎస్ టితో కలిపి 100 కోట్లను సాధించిన ఎన్టీఆర్ రెండో చిత్రంగా నిలిచింది ‘దేవర’. ఇంతకు ముందు ఆ ఘనతను సాధించిన తొలి చిత్రం రాజమౌళి స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో ‘దేవర2’కి రెడీ అవుతున్నారు ఎన్టీఆర్, కొరటాల. ప్రస్తుతం ఉన్న కమిట్ మెంట్స్ పూర్తి కాగానే ఎన్టీఆర్, కొరటాల పార్ట్ 2 పై దృష్టి సారిస్తారట.
