IPL: ఐపీఎల్ 2025 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతున్న తరుణంలో, బీసీసీఐ ఒక సంచలనకరమైన హెచ్చరికను జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి ఐపీఎల్‌లో భాగస్వామ్యమైన జట్ల ఓనర్లు, ఆటగాళ్లు, కోచ్‌లు, కామెంటేటర్లు, సిబ్బందిని టార్గెట్ చేస్తూ ఫిక్సింగ్‌లోకి దించే ప్రయత్నం చేస్తున్నట్టు బీసీసీఐకు సమాచారం అందింది.
అందరికీ హెచ్చరిక
ఈ సమాచారం వెలుగులోకి రావడంతో, బీసీసీఐ అన్ని జట్లకు అలర్ట్ జారీ చేసింది. ఈ వ్యాపారి అనేకమంది బుకీలతో సంబంధాలు కలిగి ఉన్నాడని , అతను ఎవరినైనా సంప్రదిస్తే వెంటనే బీసీసీఐకి సమాచారం అందించాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే…
మార్చి 31న వచ్చిన ఈ సమాచారం ప్రకారం, ఆ వ్యాపారి టార్గెట్ చేస్తున్న వారు కేవలం ఆటగాళ్లే కాకుండా జట్ల యాజమాన్యం, కోచింగ్ స్టాఫ్, కామెంటేటర్లు, ఇతర సిబ్బందిని కూడా ఫిక్సింగ్ వలలో పడేయాలని ప్రయత్నిస్తున్నాడు.
జట్లకు ప్రత్యేక ఆదేశాలు
ఈ పరిణామాలపై స్పందించిన బీసీసీఐ, అన్ని జట్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఆటగాళ్లు, సిబ్బంది ఎవరి పట్ల అయినా అనుమానం కలిగితే, తక్షణమే యాజమాన్యానికి, బీసీసీఐకి తెలియజేయాలని స్పష్టం చేసింది.
క్రికెట్ వర్గాల్లో కలవరం
ఈ సమాచారం బయటకు రావడంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొన్ని జట్లు తమ ప్లేయర్లకు, సిబ్బందికి నిబంధనలు గుర్తు చేస్తూ హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం.