Kaushik reddy: గ్రూప్-1 పరీక్షపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరీక్షలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన, “గ్రూప్-1లో కోట్ల రూపాయల స్కామ్ జరిగింది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరీక్ష రాయనవారికీ ఫలితాలు ఎలా?
కౌశిక్‌రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, “పరీక్ష రాయన 10 మందికి ఫలితాలు ఎలా వచ్చాయి?” అని ప్రశ్నించారు. ఇది పూర్తిగా వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పించే విధంగా ఉందన్నారు. ఫలితాల్లో తీవ్రమైన అసమానతలు కనిపిస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
పేపర్లను ప్రొఫెసర్లతో ఎందుకు కరెక్షన్ చేయలేదు?
ఇంకొక కీలక అంశాన్ని ఎత్తిచూపిన కౌశిక్‌రెడ్డి, “గ్రూప్-1 పేపర్లను అనుభవం ఉన్న ప్రొఫెసర్లతో కాకుండా, ఇతరుల చేత ఎలా కరెక్ట్ చేయించారన్నది పెద్ద అనుమానం” అని విమర్శించారు. ఇది స్పష్టమైన అవినీతి సూచన అని ఆరోపించారు.
రెండు సెంటర్లలో 1,497 మంది రాస్తే… 74 మందికి ఉద్యోగాలు ఎలా?
కౌశిక్‌రెడ్డి ఇచ్చిన సమాచారం ప్రకారం, కేవలం రెండు సెంటర్లలో 1,497 మంది పరీక్ష రాయగా, అందులో 74 మందికి ఉద్యోగాలు రావడం అనుమానాస్పదమని ఆయన అన్నారు. ఈ తేడా సహజంగా జరిగిందని నమ్మలేనని వ్యాఖ్యానించారు.
పరీక్షను వెంటనే రద్దు చేయాలి
ఈ మొత్తం వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకుని, కౌశిక్‌రెడ్డి గ్రూప్-1 పరీక్షను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.