Mandula Samel: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మీసీనది పునర్జీవన కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతి వ్యక్తి అండగా నిలవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.. మంగళవారం మేడిపల్లిలోని హోటల్లో తుంగతుర్తి నియోజకవర్గంలోని గూడూరు, మోత్కూరు, శాలిగౌరారం మండలాల ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు… హైదరాబాద్ నగరం నుంచి వచ్చే మూసి నది నుంచి వచ్చే నీటి వల్ల తుంగతుర్తి నియోజకవర్గంలోని అనేక గ్రామాలు రోగాల పుట్టలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మూసి నది నీటిని శుద్ధి చేసి, తాగునీరుగా వాడుకునేంత చక్కగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పది అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా గగ్గోలు పెడుతున్నారని, మూసీ నది ప్రక్షాళన అడ్డుకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ మహోన్నత పనికి మద్దతుగా ఈనెల 27వ తేదీన
మానాయి కుంట డ్యామ్ పైన భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి తుంగతుర్తి నియోజకవర్గంలోనిప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపాలని కోరారు. ఈ సందర్భంగా మూసీ నది గుండా వచ్చే మురికి నీటితో ఎదుర్కొంటున్న సమస్యలను, మూసి శుద్ధి జరగడం వల్ల జరిగే లాభాలను నాయకులకు వివరించారు.