Tirumala: హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల ఆలయంలో శనివారం మరో అపచారం చోటుచేసుకున్నది. ఆలయ మహాద్వారం వద్ద ఈ అపచారాన్ని గుర్తించిన సిబ్బంది వారించడంతో సరిపోయింది. లేకుంటే మహా అపచారం చోటుచేసుకునేది. భక్తుల నిర్వాకం, సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ అపచారం చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఇతర భక్తుల ఆగ్రహానికి గురైంది.
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన కొందరు భక్తులు పాదరక్షలతోనే క్యూలైన్ల గుండా వచ్చారు. అన్ని క్యూలైన్లను దాటుకుంటూ ఏకంగా మహద్వారం వరకు వచ్చారు. మహాద్వారం వద్ద ఉన్న టీటీడీ విజిలెన్స్, ఇతర సిబ్బంది గుర్తించడంతో మహద్వారం ఎదుటే విడిచి పెట్టి లోనికి వెళ్లారు. అక్కడిదాకా వచ్చేంతవరకూ సిబ్బంది గుర్తించకపోవడంపై ఇతర భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Tirumala: క్యూలైన్లలో మూడు ప్రాంతాల్లో భక్తులను టీటీడీ సిబ్బంది తనిఖీలు చేశారు. అయినా కాళ్లకు ఉన్న తెల్లనిరంగులో ఉన్న పాదరక్షలనే గుర్తించలేకపోయారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆ భక్తులు పాదరక్షలతోనే వచ్చారు. దీన్నిబట్టి భద్రతా సిబ్బంది దారుణంగా విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. తరచూ ఇలాంటి అపచారాలు చోటుచేసుకుంటున్నా, భద్రతా సిబ్బంది లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.