YCP Brutal Language

YCP Brutal Language: కారుమూరి విలనిజం… నరికేస్తాడట మరి!

YCP Brutal Language: వైసీపీ నేతలకు అధికారం పోయినా ఆత్మవిశ్వాసం చెక్కు చెదర్లేదా? లేక అది అహంకారం అనుకోవాలా? ఉన్మాదం నుండి పుట్టుకొస్తున్న ఆ బెదిరింపు భాషకు అర్థమేంటి? ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాలను స్టన్‌ అయ్యేలా చేస్తోంది ఈ ప్రశ్నలే. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి “పోలీసుల బట్టలు ఊడదీస్తా” అంటూ పదే పదే బెదిరిస్తోంటే, ఆ పార్టీ నేత కారుమూరి నాగేశ్వరరావు మరో అడుగు ముందుకేసి.. మేం అధికారంలోకి రానివ్వండి… గుంటూరు ఇవతల అయితే పరిగెత్తించి కొడతాం.. గుంటూరు అవతలైతే నరకిపడేస్తాం మై సన్స్‌.. అంటూ పచ్చి ఫ్యాక్షన్ డైలాగులతో రెచ్చిపోయారు. ఏలూరు కార్యకర్తల సమావేశంలో కారుమూరి చేసిన ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పచ్చి బూతులు మాట్లాడుతూ ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించారు. ఇప్పుడు బెదిరింపులతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారంటూ విమర్శలొస్తున్నాయి.

కారుమూరి అన్న మాటలు ఫక్తు సినిమా డైలాగులను తలపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఆయన తన నోటి చపలత్వంతో ఎర్రిపప్పగా ఫేమస్‌ అయ్యారు. ఆ ఫేమ్‌తో ఓటమి చవిచూశారు. ఆ కోపం, కసితో ఇప్పుడు విలన్‌గా అవతారం ఎత్తాలనుకుంటున్నారా అన్న సందేహాలొస్తున్నాయ్‌ ఆయన డైలాగులు వింటుంటే. మంత్రిగా బాధ్యతలు వెలగబెట్టిన సమయంలో టీడీఆర్ బాండ్స్‌ స్కామ్‌లో ఇరుక్కున్న కారుమూరి, “గుంటూరు ఇవతల కొడతాం, అవతల నరుకుతాం” అంటూ బరితెగిస్తే, అటుపక్క అధికారంలో ఉన్నప్పటికీ కూటమి నేతలు చూస్తూ ఊరుకుంటారులే అనుకున్నారో.. అది కూటమి బలహీనతగా లెక్కగట్టారో.. లేక రెచ్చగొట్టే భాషతో ఏదైనా సాధించాలనుకుంటున్నారో ఎవ్వరికీ అర్థం కాని పజిల్‌లా మారింది.

YCP Brutal Language: వైసీపీకి ఈ తరహా రాజకీయం కొత్త కాదు. అధికారంలో ఉన్నప్పుడు బూతులు, ఇప్పుడు బెదిరింపులు. కాకాణి, తోపుదుర్తి, కారుమూరి… ఇలా ఒక్కొక్కరుగా ఈ బాషలోకి మళ్లుతున్నారు. అప్పుడు బూతులతో ప్రజలకు దూరమయ్యారు, ఇప్పుడు బెదిరింపులతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టాలని చూస్తున్నారు. కానీ, ఈ ఉన్మాద భాష వారికి నష్టమే తెస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోయినా, వైసీపీ తీరు మారలేదు.

Also Read: Jagan Target Police: నాన్నా, బాబాయ్‌, తల్లి, చెల్లి… ఇక ‘క్యాడర్‌’ బలి!

YCP Brutal Language: అధికార దాహంలో రెచ్చగొట్టడం, హింసను ప్రేరేపించడం నేడు వారి వ్యూహంగా కనిపిస్తోంది. టీడీపీ ఇప్పటికే దీనిపై స్పందిస్తూ, “రెచ్చగొడితే ఊరుకోం” అని హెచ్చరించింది. కారుమూరి వంటి నేతలు ఈ బెదిరింపులతో జైలుకు దగ్గరవుతారేమోనని పరిశీలకులు అంటున్నారు. అధికారం లేని వైసీపీ, ఈ బరితెగింపు భాషతో ఏం సాధిస్తుందో వారే ఆలోచించుకోవాలని పరిశీలకులు హితవు పలుకుతున్నారు. ప్రజలు ఇప్పటికే వారి అరాచకాన్ని తిరస్కరించారు. ఇప్పుడు ఈ బెదిరింపుల వెర్షన్‌తో మళ్లీ నష్టపోవడం ఖాయమంటున్నారు. చింత చచ్చినా పులుపు చావదని అనుకోవచ్చు, కానీ ప్రజలు మారారు. వారి ఓటుతో ఈ ఉన్మాదాన్ని మళ్లీ ఖననం చేస్తారని హెచ్చరిస్తున్నారు మేధావులు, పొలిటికల్‌ అనలిస్టులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *