NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్! ‘ఎన్టీఆర్-నీల్’ మూవీ నుంచి తాజా అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి చేరబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్, ‘కేజీఎఫ్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలిసి ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించారు. ఇప్పుడు ఎన్టీఆర్ రాకతో షూటింగ్ మరింత వేగం పుంజుకోనుంది.ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ చిత్రంలో హృతిక్ రోషన్‌తో నటిస్తున్నారు. ఆ షెడ్యూల్ పూర్తయ్యాక ‘ఎన్టీఆర్-నీల్’ సెట్స్‌పై అడుగుపెడతారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు సృష్టిస్తోంది.

