Lenin: అక్కినేని హీరోలకు హిట్స్ రాకపోయినా అఖిల్ స్టార్‌డమ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. గత సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, తన తదుపరి చిత్రానికి భారీ బిజినెస్ సాధించడంలో అఖిల్ ఎప్పుడూ ముందుంటాడు.ఇదే అతని స్పెషాలిటీ! కానీ, కష్టపడినంత ఫలితం మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది.
ఇప్పుడు సాలిడ్ హిట్ కోసం కాస్త గ్యాప్ తీసుకుని, ‘లెనిన్’ అనే కొత్త అవతారంలో అఖిల్ సిద్ధమవుతున్నాడు. టైటిల్ గ్లింప్స్, అతని లుక్స్ చూస్తే..ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడని స్పష్టమవుతోంది. ఇటీవల టాలీవుడ్‌లో హీరోలు డీగ్లామ్ లుక్‌తో వచ్చి సూపర్ హిట్స్ కొట్టారు.
Also Read: Vishwambhara: విశ్వంభర ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది!
Lenin: ‘పుష్ప’లో అల్లు అర్జున్, ‘దసరా’లో నాని, రీసెంట్‌గా నాగ చైతన్య ‘తండేల్’.. ఇలా వింటేజ్ స్టైల్‌తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్ సాధించారు. ఆసక్తికరంగా, ఈ సినిమాల్లో హీరోలంతా పొడవాటి జుట్టు, గడ్డంతోనే కనిపించారు. ఇప్పుడు ‘లెనిన్’లో అఖిల్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. మరి ఈ ట్రెండ్ అఖిల్‌కు కూడా బ్లాక్‌బస్టర్ ఇస్తుందా? లేదా? సినీ ప్రియుల్లో ఉత్కంఠ నెలకొంది. అఖిల్ ఈసారి హిట్ ఖాతా తెరుస్తాడా? వేచి చూడాల్సిందే!
లెనిన్ – టైటిల్ గ్లింప్స్ ఇక్కడ చూడండి :