Manchu Lakshmi: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని మంచు లక్ష్మీ అన్నారు.. గద్వాల జిల్లా గట్టు మండలంలో వెనుకబడిన విద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.. ఇవాళ గద్వాల కలెక్టరేట్ లో కలెక్టర్ సంతోష్ తో మంచు లక్ష్మీ సమావేశం అయ్యారు.
స్వచ్ఛంద సంస్థ టీచ్ ఫర్ చేంజ్ సంస్థ అధ్యక్షురాలు అయిన మంచు లక్ష్మీ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తమ సహకారం అందించాలని ఆమె కోరారు..టీజ్ ఫర్ చేంజ్ లో భాగంగా డిజిటల్ క్లాస్ లు నిర్వహిస్తామని తెలిపారు..వెనుకబాటు కు గురైన ప్రాంతాల్లో పెగాసెస్ సిస్టం కంపెనీ ఆర్థిక సహకారంతో ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాస్ ల నిర్మాణం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంచు లక్ష్మీ చెప్పారు..గట్టు మండలంలో 30 ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ క్లాస్ ల నిర్మాణం పూర్తి చేశామని ఈ ఏడాది కూడా మరో 20 డిజిటల్ క్లాస్ లు నిర్మాణం చేస్తామని ఆమె చెప్పారు.. గట్టు మండలం ఆలూరు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంచు లక్ష్మీ ఈ సందర్బంగా కలెక్టర్ తో సమావేశం అయ్యారు.