Cm chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీ, ఆలయాల అభివృద్ధి, నిర్మాణ పనులు తదితర అంశాలపై సమగ్ర చర్చ చేపట్టారు.
అమరావతిలో టీటీడీ ఆలయ నిర్మాణం
అమరావతిలో టీటీడీ ఆలయ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మొదటగా రూ. 150 కోట్ల అంచనాతో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. అయితే, గత ప్రభుత్వ హయాంలో దీనిని రూ. 35 కోట్లకు కుదించారు. ఇప్పుడు తిరిగి మొదటి ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధి
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొని వివిధ అంశాలపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. భక్తుల సౌకర్యాల పెంపు, ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీఇచ్చారు.