Sikandar: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన భారీ అంచనాల చిత్రం ‘సికందర్’. ఈద్ సందర్భంగా రిలీజైన ఈ సినిమా, సల్మాన్ కెరీర్‌లో మరో నిరాశపరిచే చిత్రంగా నిలిచింది. అనౌన్స్‌మెంట్ సమయంలో ఉన్న హైప్ రిలీజ్ నాటికి కనిపించలేదు. ఫలితంగా, డల్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, కంటెంట్ విషయంలో తేలిపోవడంతో మరింత నష్టపోయింది. ఆశ్చర్యకరంగా, నార్త్ ఇండియాలోనూ సల్మాన్ సినిమాను ప్రేక్షకులు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. హిందీలో రిలీజైన ఈ చిత్రం, థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయని సమాచారం. దీంతో సల్మాన్ సినిమాకు ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘సికందర్’ దుర్గతితో సల్మాన్ కెరీర్ కూడా కష్టాల్లో పడినట్లే కనిపిస్తోంది. గత విజయాల స్థాయిని చేరుకోవడం సల్మాన్‌కు సవాలుగా మారింది. మరి, ఈ సూపర్‌స్టార్ తన మార్క్ కంబ్యాక్‌ను ఎప్పుడు అందిస్తారో చూడాలి.
