Kalyan Ram

Kalyan Ram: మాస్ సాంగ్ తో రాబోతున్న కళ్యాణ్ రామ్!.

Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ S/O వైజయంతి’ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీడియో చూస్తే.. ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించడం ఖాయమనిపిస్తోంది.

తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఎక్స్‌ప్లోసివ్ అప్‌డేట్ వచ్చేసింది. ఫస్ట్ సింగిల్‌గా ‘నాయాల్ది’ అనే పాటను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సాంగ్ పూర్తి మాస్ బీట్‌తో ఉంటుందని.. కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు చూడని డ్యాన్స్ మూమెంట్స్‌తో అభిమానులను అలరించబోతున్నారని సమాచారం. ఈ సూపర్ ఎనర్జిటిక్ సాంగ్‌ను మార్చి 31న విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక రోల్‌లో కనిపించనుండగా.. సాయీ మంజ్రేకర్, సోహైల్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా మెయిన్ క్యాస్ట్‌లో ఉన్నారు. సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి బీట్స్ అందిస్తున్నారు. ‘నాయాల్ది’ పాటతో పాటు.. కళ్యాణ్ రామ్ ఎనర్జీ, విజయశాంతి నటన ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాయి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాస్ ఫ్యాన్స్‌కి ఈ మూవీ ఓ పెద్ద ట్రీట్ కాబోతోందని టాక్!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *