Earthquake: మయన్మార్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలతో భవనాలు కంపించాయి, ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. సామాజిక మాధ్యమాల్లో, భూకంప సమయంలో భవనాలు కంపించడం, స్విమ్మింగ్ పూల్లలో నీరు చిందరవందరగా పడటం, హోటళ్లలో భోజనం చేస్తున్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీయడం వంటి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Swiggy Delivery Incident: వృద్ధ దంపతులను కొట్టిన స్విగ్గీ డెలివరీ బాయ్
మయన్మార్‌లో ఇటీవలి కాలంలో భూకంపాలు తరచుగా నమోదవుతున్నాయి; ఈ నెల ప్రారంభంలో కూడా అక్కడ భూమి కంపించింది. ప్రస్తుతం, ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలపై పూర్తి సమాచారం అందుబాటులో లేదు. సంబంధిత అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

