Telangana assembly: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు, వీడియోలు తీశారని ఆయన స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుతోపాటు పలువురిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆది శ్రీనివాస్ స్పీకర్‌ను కోరారు. అసెంబ్లీ సమావేశాలు ఆఖరుకు చేరిన రోజే ఫిర్యాదు చేయడం గమనార్హం. శాసన సభ నిబంధనలకు విరుద్ధంగా సెల్ ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీయడంపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
