Robin Hood: “రాబిన్ హుడ్” తొలి వారం స్పెషల్ టికెట్ ధరలతో రాబోతుందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రతి టికెట్‌పై రూ.75 అదనంగా చార్జ్ చేయడానికి, సింగిల్ స్క్రీన్‌లలో రూ.50 వరకు అధిక ధర వసూలు చేయడానికి అనుమతి ఇచ్చారు. మొదటి వారం హైప్‌ను క్యాష్ చేసుకోవాలనే నిర్మాతలకు ఇది ప్లస్ అవుతోంది.ప్రస్తుతం థియేటర్ల వద్ద స్పెషల్ షోస్, అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, మొదటి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.25-30 కోట్ల వసూళ్లు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఫన్, కామెడీ, యాక్షన్ మిక్స్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఛాన్సుంది. పైగా టికెట్ రేట్లు పెరగడంతో ఓపెనింగ్స్ పరంగా రాబిన్ హుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు.
